తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ బస్ భవన్ లో ఈరోజు సమావేశమైన తెలంగాణ ఆర్టీసీ బోర్డు  కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు అనుమతి ఇచ్చింది. కొత్త డిపోల ఏర్పాటుతో పాటు ప్రస్తుతమున్న 97 డిపోలు , బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లిలో కొత్త బస్ డిపో కోసం నిర్మాణం కోసం రూ.11.70 కోట్లు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం రూ.6.28 కోట్లు. ములుగు లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.11 కోట్లు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కొత్త బస్ స్టేషన్ కోసం రూ. 3.75 కోట్లు. ఖమ్మం జిల్లా మధిరలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.10.00 కోట్లు. ములుగు జిల్లా మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 51.00 లక్షలు. పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టేషన్ విస్తరణ కోసం రూ.95.00 లక్షలు.  సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 17.95 కోట్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 3.95 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)