రాష్ట్రీయ జనతా దళ్‌ అధ్యక్షుడిగా తేజస్వీయాదవ్‌ ఎన్నిక !

Telugu Lo Computer
0


రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జెడి) అధ్యక్షుడిగా తేజస్వీయాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం పాట్నాలో నిర్వహించిన ఆర్‌జెడి జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు, బీహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న తేజస్వీయాదవ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్లు పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పేర్కొంది. పార్టీలో తేజస్వీయాదవ్‌ స్థాయి పెరగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తేజస్వీయాదవ్‌ కూడా లాలూ యాదవ్‌తో పాటు పార్టీ, పార్టీ టిక్కెట్‌, గుర్తులో సవరణలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చని తీర్మానం పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)