బెంగళూరు లోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా షో నిర్వహించనున్న నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చుట్టూ 13 కిలోమీటర్ల పరిధిలో జనవరి 23 నుంచి మాంసం దుకాణాలను మూసి ఉంచాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికఆదేశాలు జారీ చేసింది. నాన్-వెజ్ హోటళ్లు, రెస్టరెంట్లకు కూడా ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ఫిబ్రవరి 17 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఈ ఎయిర్ షో జరగనుంది. సాధారణంగా మాంసాహారం విక్రయించే ప్రదేశాల్లో గద్దలు, డేగలు లాంటి పక్షులు ఎక్కువగా తిరుగుతుంటాయి. పొరపాటున ఎయిర్ షో జరిగే ప్రాంతంలోకి ఇవి ఎగిరొస్తే భారీ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీబీఎంపీ చర్యలు తీసుకుంది. ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతానికి 13 కిలోమీటర్ల పరిధిలో నిర్దేశిత సమయంలో ఎలాంటి మాంసాహారం విక్రయాలు జరపకూడదని ఆదేశించింది. చేపలు, చికెన్, మటన్ తదితర దుకాణాలన్నింటినీ మూసి వేయాలని, దీనికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరింది. ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
బెంగళూరులో ఏరో ఇండియా షో : మాంసం దుకాణాలపై నిషేధం
January 18, 2025
0
Tags