కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ సోషల్ మీడియాలో వైరల్ !

Telugu Lo Computer
0


పిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి పావెల్ జాబ్స్ వెళ్లారు. కుంభమేళాకు వెళ్లాలనుకున్న తన భర్త స్టీవ్ జాబ్స్ కోరికను నెరవేర్చారు. ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేస్తుండొచ్చు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయమేటంటే స్టీవ్ జాబ్స్ 1974లోనే కుంభమేళాకు వెళ్లాలనుకున్నారట. అందుకోసం స్టీవ్ 1974లో వేసిన ప్లాన్ కు సంబంధించిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖను ఇటీవలే బోన్హామ్స్ సంస్థ వేలం వేయగా 5 లక్షల డాలర్లకు పైగానే అమ్ముడుపోవడం చెప్పుకోదగిన విషయం. అప్పట్లో స్టీవ్ జాబ్స్ కుంభమేళా వెళ్లాలనుకున్నారని, అందుకు 1974లో ఓ ప్లాన్ కూడా చేశారని తాజాగా అతని చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్ వెల్లడించారు. 19వ పుట్టిన రోజున స్టీవ్ జాబ్స్ తనకు రాసిన లేఖలో బౌద్ధమతం గురించి చెప్పారని.. భారత దేశంలో జరిగే కుంభమేళాకు వెళ్లాలని ఆశపడుతున్నట్లు చెప్పారన్నారు. టిమ్ బ్రౌన్ రాసిన లేఖకు ప్రతిస్పందనగా స్టీవ్ జాబ్స్ ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉందని, తాను చాలా సార్లు ఏడ్చానని కూడా ఆయన లేఖలో రాశారు. ఏప్రిల్లో ప్రారంభమయ్యే కుంభమేళాకు భారత దేశానికి వెళ్లాలనుకుంటున్నాని చెప్పిన స్టీవ్.. మార్చిలో వెళ్తానని, కానీ దాని గురించి ఇంకా కచ్చితమైన ప్లాన్ లేదని తెలిపాడు. జాబ్స్ స్వయంగా తన చేతితో రాసిన ఈ లేఖను 2021లో వేలం వేయగా.. రూ.4.32 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది జాబ్స్ లోని ఆధ్యాత్మికతను వెలికితీసింది. జాబ్స్ ఎప్పుడూ కుంభమేళాకు హాజరు కానప్పటికీ, అతను ఉత్తరప్రదేశ్ లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాడు. నీమ్ కరోలి బాబా అంతకుముందు సంవత్సరమే మరణించాడని అతనికి ఆ తరువాత తెలిసింది. అయినప్పటికీ, జాబ్స్ కైంచి ధామ్ ఆశ్రమాన్ని ఎంచుకున్నాడు. అతను భారతదేశంలో ఏడు నెలలు గడిపాడు. సంస్కృతి, ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్తో కలిసి ఆపిల్ కంపెనీని ప్రారంభించే కంటే రెండేళ్ల ముందే ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయన తన చిరకాల వాంఛ తీరకుండానే అక్టోబర్ 5. 2011న 56 ఏళ్ల వయసులో స్టీవ్ జాబ్స్ మృతి చెందాడు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ ఇటీవలే 40 మంది సభ్యుల బృందంతో ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె గురువు స్వామి కైలాసానంద గిరి ఆశ్రమంలో ఉన్నట్టు సమాచారం. ఆమె ఆమె ధ్యానం, క్రియా యోగా, ప్రాణాయామం వంటి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ భారతీయ సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అనుభవిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)