పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై మాజీ మంత్రి దంపతులిద్దరు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.లక్షన్నరతో పాటు భారీగా ఆభరణాలు తస్కరణకు గురయ్యాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పని మనుషులతో సహా ప్రతి ఒక్కరినీ విచారించి పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)