ఎమ్మెల్సీ అనుచరుడిపై బీటెక్‌ రవి వర్గీయులు దాడి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల తెదేపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. బీటెక్ రవి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. తెదేపా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అనుచరుడు, వేంపల్లికి చెందిన ప్రకాశ్‌ రేషన్ దుకాణం కోసం పులివెందులలోని పాఠశాలలో పరీక్ష రాయడానికి వఛ్చారు. ఈ క్రమంలో ఎగ్జామ్‌ రాసేందుకు వెళ్తుండగా అతడిని బీటెక్‌ రవి అనుచరులు చితకబాదారు. ప్రకాశ్‌ను వదిలిపెట్టాలని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి భార్య ఉమాదేవి ధర్నాకు దిగారు. పోలీసుల జోక్యంతో ప్రకాశ్‌ను వదిలేశారు. మరోవైపు గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఇసుక టెండర్ల కోసం బీటెక్‌ రవి అనుచరులు హంగామా సృష్టించారు. ఆ ఘటన మరవక ముందే శుక్రవారం పులివెందులలో మరోసారి రెచ్చిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)