తమన్ నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది : చిరంజీవి ట్విట్ !

Telugu Lo Computer
0

                                                       

డాకు మహారాజ్ చిత్రయూనిట్ వేడుకలో తమన్ మాట్లాడుతూ ఆన్ లైన్ నెగిటివిటీ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమన్ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'డియర్ తమన్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది' అంటూ ట్వీట్ చేశారు. డాకు మహరాజ్ సక్సెస్ మీట్‏లో తమన్ మాట్లాడుతూ.. 'ట్రోలర్స్ ని చూస్తుంటే భయంగా, సిగ్గుగా ఉంది. తెలుగు ఫ్లయింగ్ హై … షైన్ లో ఉంది. దీనిని కాపాడడం మన అందరి బాధ్యత. ప్రొడ్యూసర్ బాగుండాలి అని ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరు కోరుకోవాలి. నెగిటివ్ ట్రోల్స్ అనేది భయంగా, సిగ్గుగా ఉంది. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుంది. ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి హీరో ఫ్యాన్ కి ఎంతో బాధ్యత ఉంది. నెగిటివిటీ ని స్ప్రెడ్ చేయొద్దు. హిందీ మలయాళ కన్నడ వాళ్ళు మన తెలుగు చేయాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. తెలుగు కి ఇతర భాషల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో గౌరవం ఉంది. ట్రోల్స్ తో మన పరువుని మనమే తీసుకోవద్దు' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)