మార్కెట్‌లో తగ్గిన బియ్యం ధరలు !

Telugu Lo Computer
0


మార్కెట్‌లో బియ్యం ధరలు తగ్గు ముఖం పట్టాయి. క్వింటాలుకు వెయ్యి రూపాయల వరకు తగ్గింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు అధిక శాతం మంది సన్న బియ్యం వినియోగిస్తారు. స్థానికం గా సన్న బియ్యం ధాన్యం ఇక్కడ పంట లేని కారణంగా కర్నాటక, తెలంగాణలోని కొన్ని ప్రాం తాల నుంచి దిగుమతి చేసుకుంటారు. గడచిన సార్వాలో దిగుబడులు అధికంగా ఉండటం, సన్న బియ్యం అమ్మకాలు నాలుగింట ఒకవంతు తగ్గడంతో తగ్గుముఖం పట్టాయి. ఇటీవల రేషన్‌ బియ్యం అక్రమ ఎగుమతులపై ఉక్కుపాదం మోపడంతో మార్కెట్‌లో వీటి కొనుగోళ్లు తగ్గా యి. రేషన్‌ బియ్యాన్ని రిటైల్‌ వర్తకులు కొని రీసైక్లింగ్‌కు పంపిస్తారు. ఇటీవల దాడులు పెర గడంతో వీటి అమ్మకం ధర కిలో రూ.20 నుంచి రూ.15కి తగ్గింది. కోటా బియ్యం తెచ్చుకునే లబ్ధిదారులు వాటిని అమ్ముకునే అవకాశాలు తగ్గడంతో, సన్న బియ్యా న్ని కోటా బియ్యంలో కలుపుకుని వాడు తున్నారు. ఈ కారణంగా సన్న బియ్యం అమ్మకాలు తగ్గాయి. కొన్నిరకాల బియ్యంపై కేజీకి రూ.8 తగ్గగా మరికొన్ని రకాలపై రూ.10 తగ్గింది. గత జగన్‌ ప్రభుత్వంలో కోటా బియ్యం విచ్చలవిడిగా అమ్మేవారు. వీటికి ఫాలిష్‌ పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పుడు అక్రమ ఎగుమతులు నిలిచిపోవడంతో వీటి ధరలు పడిపోయాయి. కోటా బియ్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది రైతులు పశువుల దాణాకు వినియోగిస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో బియ్యాన్ని నూకగా మార్చి చేపల మేతగా వినియోగిస్తున్నారు. వీటి అవసరాలకు జిల్లాలో పంపిణీ చేస్తున్న కోటా బియ్యంలో సుమారు 30 శాతం అక్రమ వినియోగం జరుగుతుండగా 70 శాతం లబ్ధిదారులు వినియోగిస్తున్నారు. కోటా బియ్యం తీసుకుంటున్న కొన్ని కుటుంబాలలో బియ్యాన్ని అన్నానికి వినియోగిస్తుండగా, మరపట్టించి వరి నూక ఉప్మాకు, దోశల పిండిగా ఉపయోగిస్తున్నారు. మొత్తంగా రేషన్‌ బియ్యం అక్రమరవాణాకు అడ్డుకట్టపడటంతో సన్న బియ్యం ధరలు దిగి వచ్చాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)