దుబాయ్‌లో జరిగిన 24 గంటల దుబాయ్ 2025 అంతర్జాతీయ కార్ రేస్‌లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నేతృత్వంలోని జట్టు మూడో స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సమాచారాన్ని తెలియజేశారు. అందులో 'దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో అజిత్ 991 కేటగిరీ, జీ14 విభాగంలో మూడో స్థానంలో నిలిచారు. ప్రాక్టీస్ సమయంలో బ్రేక్ వేయకపోవడంతో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం జరిగిన కొద్ది రోజుల్లోనే అజిత్ జట్టు విజయాన్ని సాధించిందని సురేష్ చంద్ర గర్వంగా తెలిపారు.
దుబాయ్ కార్ రేసులో మూడో స్థానంలో నిలిచిన అజిత్ కుమార్ టీం !
January 12, 2025
0
Tags