మార్చి 21 నుంచి ఐపీఎల్ !

Telugu Lo Computer
0


మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ముంబైలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మార్చి 21న ప్రారంభమై మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఐతే, మ్యాచులకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని శుక్లా తెలిపారు.మార్చి 14వ తేదీనే ఐపీఎల్ ప్రారంభించాల్సి ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మార్చి 4న, రెండో సెమీఫైనల్ మార్చి 5న జరగనుంది. ఇక మార్చి 9న ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌లో ఉంది. ఈ టోర్నీ జరిగిన వెంటనే మార్చి 14 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆ క్రమంలో ఆటగాళ్లకు పెద్దగా విరామం లభించడం లేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మార్చిలో పాకిస్థాన్, యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌లో పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. అందువల్ల వారికి కూడా విశ్రాంతి లభించదు. అందుకే ఐపీఎల్ ప్రారంభ తేదీని మార్పు చేసినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఐపీఎల్‌ కొత్త కమిషనర్‌ను నియమిస్తామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)