పెళ్లి పత్రికలను పంచడానికి వెళ్లిన తండ్రి దుర్మరణాన్ని దాచిపెట్టి కూతురికి వివాహం !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా తరీకెరెకి చెందిన చంద్రు కూతురు దీక్షితకి పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం సాయంత్రం చంద్రు మరో ఇద్దరితో కలిసి పెళ్లి పత్రికలను పంచడానికి బైక్‌లో వెళ్లాడు. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొనటంతో చంద్రు, జతగా వెళ్లిన ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషయం తెలిసి బంధువులు విషాదంలో మునిగిపోయినా తల్లీ, కూతురికి చెప్పలేదు. ఆ వార్త తెలిసినా, మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినా పెళ్లి నిలిచిపోయి మరింత విషాదం ఏర్పడుతుందని భావించారు. అందుకే చివరి నిమిషం వరకు చంద్రు పెళ్లి పనుల్లో ఉన్నాడని చెబుతూ సోమవారం మూడుముళ్ల వేడుకను పూర్తి చేయించారు. తండ్రి స్థానంలో మరో వ్యక్తిని ఉంచి కన్యాదానం చేశారు. అక్షింతలు, అతిధుల భోజనాల తరువాత చంద్రు భార్య, కూతురికి ఈ చేదు వార్త చెప్పగానే వారు బోరుమంటూ విలపించారు. అప్పటివరకు ఉన్న పెళ్లి కళ దూరమైంది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులే అంత్యక్రియల పనులు పూర్తిచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)