రూపే భాగస్వామ్యంతో ఐడీఎఫ్‌సీ నుంచి ఫస్ట్‌ బ్యాంక్‌ ఫస్ట్‌ ఎర్న్‌ క్రెడిట్‌ కార్డ్‌ !

Telugu Lo Computer
0


రూపే భాగస్వామ్యంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కలిసి సరికొత్త క్రెడిట్‌ కార్డ్‌ని లాంచ్‌ చేసింది. ఫస్ట్‌ ఎర్న్‌ పేరిట యూపీఐ ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్‌ కార్డ్‌ను  తీసుకొచ్చింది. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారికి ఈ కార్డుల్ని జారీ చేయనుంది. కార్డ్‌ సాయంతో కస్టమర్లు యూపీఐ జరపవచ్చని, ప్రతి లావాదేవీపై క్యాష్‌బ్యాక్‌, రివార్డులు పొందొచ్చని బ్యాంక్‌ తెలిపింది. ఈ వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌ సాయంతో సౌకర్యవంతంగా లావాదేవీలు చేయవచ్చని బ్యాంక్‌ తెలిపింది. కొత్త కార్డ్‌ హోల్డర్లు మొదటి యూపీఐ లావాదేవీల మొత్తం 100 శాతం (రూ.500 వరకు) క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. అయితే కార్డ్‌ క్రియేట్‌ చేసిన 15 రోజుల వరకు ఈ సదుపాయం ఉంటుంది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ ద్వారా జరిపే యూపీఐ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌, ఇతర యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలు, బీమా చెల్లింపులు, యుటిలిటీ బిల్లులు, ఇ- కామర్స్‌ కొనుగోళ్లపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది. సంవత్సరం 1 రోజు కాలపరిమితితో చేసే ఎఫ్‌డీపై 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. జొమాటో తీసుకొచ్చిన డిస్ట్రిక్ట్ సాయంతో మూవీ టికెట్లు కొనుగోలు చేస్తే 25 శాతం (రూ.100వరకు) తగ్గింపు పొందొచ్చు. రూ.1,399 విలువైన రోడ్‌ అసిస్టెంట్స్, కార్డ్‌ పోగొట్టుకుంటే రూ.25వేల వరకు లాస్ట్‌ కార్డ్ లయబలిటీ, రూ.2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా అందిస్తోంది. ఈ యూపీఐ ఆధారిత క్రెడిట్‌ కార్డ్‌ సాయంతో 60మిలియన్లకు పైగా క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయొచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)