ఉపాధి హామీ పనుల్లో తల్లీకూతురు మృతి : మంత్రి సీతక్క ద్రిగ్బాంతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెందడం పట్ల మంత్రి సీతక్క ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాదం పై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ఆ ప్రాంతంలో పనులు చేయొద్దని జిల్లా అధికారులు వారం రోజుల క్రితమే హెచ్చరించినా పనులు కొనసాగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై శాఖ అధికారులతో సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చారు. కాగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం జరిగింది. బండరాళ్లు మీద పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. గుట్టపై పని చేస్తున్న కందారపు సరోజన, ఆమె కూతురు అన్నారి మమత మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)