ఆస్ట్రేలియాలో జరుగుతున్న బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్-75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)-చార్లెస్ బ్రూమ్ (బ్రిటన్) ద్వయం 6-4, 6-3తో హేడెన్ జోన్స్-పావ్లె మారిన్‌కోవ్ (ఆ్రస్టేలియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న మాంట్‌పెలియర్ ఏటీపీ-250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)-అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో యూకీ-ఒలివెట్టి జంట 7-5, 3-6, 10-8తో జేకబ్ ష్నయిటర్-మార్క్ వాల్నర్ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో విజయ్ సుందర్ ప్రశాంత్-జీవన్ నెడుంజెళియన్ (భారత్) జోడీ 1-6, 5-7తో ఫ్లావియో (ఇటలీ)-జొనాథన్ ఎసెరిక్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది.
బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్-75 టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ జోడీ
January 30, 2025
0
Tags