వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ టీ20 క్రికెట్ హిస్టరీలో 900 సిక్సర్లు బాదిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు ఆడుతున్న పొలార్డ్… డెసెర్ట్ వైపర్స్ తో గురువారం జరిగిన మ్యాచ్లో చెలరేగి ఆడాడు. 23 బంతులు ఎదుర్కొని 36 పరుగులు సాధించాడు. ఇందులో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ మూడు సిక్సర్లతో కలుపుకొని టీ20 క్రికెట్ లో అతడి సిక్సర్ల సంఖ్య 900 దాటింది. దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో లూకీ ఫెర్గూసన్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టి 900వ సిక్సర్ ను సాధించాడు
900 సిక్సర్ల క్లబ్ లో కీరన్ పొలార్డ్ !
January 17, 2025
0
Tags