సంక్రాంతి కానుకగా మంగళవారం నాడు విడుదలైన విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, పైగా సంక్రాంతి పండగ సీజన్ కు రావడంతో సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్లు (గ్రాస్) రాబట్టిందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ విక్టరీ వెంకటేశ్ అంటూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.45 కోట్ల (గ్రాస్) వసూళ్లు వచ్చాయి. రెండు రోజుల్లోనే రూ. 77 కోట్ల (గ్రాస్)కు చేరాయి. ఇప్పుడు మూడు రోజుల్లోనే సినిమా వంద కోట్ల క్లబ్లోకి చేరింది.
మూడు రోజుల్లో రూ.106 కోట్లు సాధించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా !
January 17, 2025
0
Tags