పాత రేషన్ కార్డులు తొలగించం - 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి మండల మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని, పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని ప్రకటించారు. 2 కోట్ల 81 లక్షల మందిలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లి అయిన వారికి,కొత్త కుటుంబాలు , మార్పులు చేర్పులు , అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త అన్నారు. వారికి జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఇస్తుందని ప్రకటించారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి , ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)