8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. 8వ వేతన సంఘం ఏర్పాటు చేసిన తర్వాత తమ తుది నివేదికను 2026లో సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ మేరకు 8వ పే కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు, కరువు భత్యం, పింఛన్ల వంటివి పే కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిసిందే. ప్రస్తుంత 7వ వేతన సంఘం అమలులో ఉంది. అయితే ఈ పే కమిషన్ ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తవుతున్న క్రమంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరిగాయి. ఉద్యోగ సంఘాలు పలు సందర్భాల్లో కేంద్రానికి వినతులు పంపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1, 2025 రోజున ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో దీనిపై ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ, అంతకున్నా ముందే కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)