తెలంగాణ, మహారాష్ట్రలో ఇటీవల 200 రూపాయల నోట్లు కలర్ జిరాక్స్ చేసి చలామణీ చేస్తున్న వ్యవహారం వెలుగుచూసింది. ముఖ్యంగా 2 వేల రూపాయల నోటు రద్దు చేసిన తరువాత నకిలీ 500, 200 రూపాయల నోట్లు పెరిగాయని ఆర్బీఐ స్వయంగా వెల్లడించింది. అందుకే వీటిని రద్దు చేయనుందనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా జరుగుతోంది. అయితే ఆర్బీఐ ఈ విషయాన్ని ఖండించింది. 200 రూపాయల నోట్లను రద్దు చేయడం లేదని తెలిపింది. అదే సమయంలో నకిలీ 200 రూపాయల నోటును ఎలా గుర్తించాలో సూచించింది. ఒరిజినల్ 200 రూపాయల నోటుపై 200 అనేది దేవనాగరి లిపిలో ఉంటుంది. నోటు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం స్పష్టంగా కన్పిస్తుంటుంది. నోట్‌పై ఆర్ బిఐ, భారత్, ఇండియా, 200 అనే అక్షరాలు సూక్ష్మంగా ఉంటాయి. 200 రూపాయల నోటుపై ఇండియా, ఆర్బీఐ అని రాసిన సెక్యూరిటీ త్రెడ్ ఉంటుంది. నోటుకు కుడివైపున అశోక స్థంభం ఉంటుంది. ఈ లక్షణాల్ని బట్టి నకిలీ ఏదో, అసలు ఏదో సునాయసంగా గుర్తించవచ్చంటోంది ఆర్బీఐ. నకిలీ నోట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
200 రూపాయల నోట్లు రద్దు చేయడం లేదు : ఆర్బీఐ !
January 16, 2025
0
Tags