ఐసీసీ టీ20 జట్టు ప్రకటన !

Telugu Lo Computer
0


తేడాది టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్‌ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్‌ శర్మతో పాటు మరో ముగ్గురు భారత స్టార్‌ క్రికెటర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కింది. అయితే, ఇందులో విరాట్‌ కోహ్లి పేరు లేకపోవడం గమనార్హం. ఈ జట్టులో రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా ఆస్ట్రేలియా బ్యాటర్‌  ట్రవిస్‌ హెడ్‌ ఎంపిక కాగా, వన్‌డౌన్‌లో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌ చోటు దక్కించుకున్నాడు. మిడిలార్డర్‌లో నాలుగో స్థానంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం, ఐదో నంబర్‌ బ్యాటర్‌గా, వికెట్‌ కీపర్‌ కోటాలో వెస్టిండీస్‌ స్టార్‌ నికోలస్‌ పూరన్‌ స్థానం సంపాదించాడు. ఏడో స్థానంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎంపిక కాగా, ఆప్ఘనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, శ్రీలంక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. పేస్‌ దళంలో టీమిండియా ప్రధాన బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు యువ ఆటగాడు అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానం సంపాదించుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)