పది రోజులకే సంక్రాంతికి వస్తున్నాం సినిమా 230 కోట్ల గ్రాస్ ని దాటేసిన ఈ బ్లాక్ బస్టర్ ఇప్పుడు రెండో రౌండ్ కు సిద్ధపడుతోంది. నిన్న రిలీజైన కొత్త సినిమాలేవీ కనీస స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయాయి. గాంధీ తాత చెట్టు మీద జనంలో పెద్దగా ఆసక్తి లేకపోవడంతో పాటు టాక్ అంతంతమాత్రంగా ఉండటం చూస్తే పికప్ అనుమానమే. హత్య ఓ మోస్తరుగా ఓకే అని వినిపించినా అది వసూళ్లుగా మారే సూచనలు తక్కువే. ఐడెంటిటీ థియేటర్లో షో పడకముందే ఓటిటి డేట్ ప్రకటించడంతో ఉన్న కాసింత ఆసక్తిని సున్నా చేశారు. వీకెండ్ కి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ ఛాయస్ కాబోతోంది. బుకింగ్ ట్రెండ్స్ లో ఇదే స్పష్టమవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో ద్వారా లక్షకు పైగానే టికెట్లు అమ్ముడుపోయాయి. శని ఆదివారాల్లో ఈ నెంబర్ డబుల్ అయినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా చోట్ల గేమ్ ఛేంజర్ తీసేసి వెంకటేష్ కి స్క్రీన్లు పెంచుతున్నారు.
పది రోజుల్లో 230 కోట్ల గ్రాస్ ని దాటేసిన సంక్రాంతికి వస్తున్నాం !
January 25, 2025
0
Tags