తెలంగాణ ప్రభుత్వం కొత్త జారీ చేయబోతున్న రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోందని విమర్శించారు. అవసరమైతే తామే రేషన్ కార్డులు ముద్రించి ఇస్తామని కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తోన్న ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు అని పెడితే కేంద్రం ఒక్క ఇళ్లు కూడా ఇవ్వబోదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామన్నారు.
తెలంగాణ రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ !
January 25, 2025
0
Tags