మొదటి హైడ్రోజన్ ట్రైన్ సెట్ 2025 మార్చి 31 నాటికి సిద్ధం ?

Telugu Lo Computer
0


హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారత్‌  సిద్ధమైంది. డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లకు మారిన తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పుడు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌పై దృష్టి సారిస్తోంది. ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌లో హైడ్రోజన్ ట్రైన్‌ కొత్త శకానికి నాంది పలకనుంది. మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్‌ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ  నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీవైపు కీలక ముందడుగు. ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్‌ సెల్స్‌ని క్లీన్‌ ఎనర్జీ సోర్సుగా ఉపయోగిస్తారు. ఈ రైళ్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2800 కోట్లు కేటాయించింది. ఈ ఇనిషియేటివ్‌ కింద మొత్తం 35 హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను తీసుకురావాలని ప్లాన్ చేశారు. మొదటి హైడ్రోజన్ ట్రైన్ సెట్ 2025 మార్చి 31 నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ICF జనరల్ మేనేజర్ యు.సుబ్బా రావు ప్రకారం, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కోచ్‌ల ప్రొడక్షన్‌ వేగంగా జరుగుతోంది. రైలును 2025 మార్చి 25 నాటికి ఆవిష్కరించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇంజిన్‌ను అభివృద్ధి చేసిన దేశంగా భారత్‌ నిలిచింది. ఇతర దేశాలు 500-600 హార్స్‌పవర్ తో హైడ్రోజన్ రైళ్లను నిర్మించగా, భారతదేశం 1,200 హెచ్‌పీ సామర్థ్యం గల ఇంజిన్‌ను రూపొందించింది. మొదటి హైడ్రోజన్‌ ట్రైన్‌ ఉత్తర రైల్వే ఢిల్లీ డివిజన్‌లో నడుస్తుంది. 89 కిలోమీటర్ల పొడవు గల జింద్-సోనిపట్ సెక్షన్‌లో సేవలు అందిస్తుందని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)