తెలంగాణలో మద్యం ధరలు పెంపు ?

Telugu Lo Computer
0


తెలంగాణలో మద్యం ధరలు భారీ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచనున్నట్టు సమాచారం. ఈ మేరకు మద్యం ధరలపై త్రి సభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలో జరుగబోయే పంచాయతీ ఎన్నికల కంటే ముందే మద్యం ధరలను దాదాపు పెంచేందుకు ప్లాన్ సిద్ధమైంది. ఇప్పటికే మద్యం ధరల పెంపు పై త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 01వ తేదీ నుంచి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం బ్రాండ్స్ బీర్ల పై 15 శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)