నోబెల్ శాంతి బహుమతి 2025కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు. గతంలోనూ ఓ సారి ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేయగా మస్క్‌కు బహుమతి లభించలేదు. అయితే ఈ సారి మస్క్ పేరును యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ ప్రతిపాదించారు. ఎక్స్, స్పేస్‌ఎక్స్, టెస్లా వంటి కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతి 2025 అభ్యర్థిత్వానికి ఎంపిక అయినట్టు యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు బ్రాంక్ గ్రిమ్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులపై మస్క్ ఎక్స్ వేదికగా తన నిబద్దతను చాటుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి అందాలని కోరుకుంటున్నట్టు వివరించారు. జనవరి 29వ తేదీన ఆ అభ్యర్థిత్వాన్ని నోబెల్ కమిటీకి సమర్పించినట్టు బ్రాంకో గ్రిమ్స్ స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. నోబెల్ శాంతి బహుమతి 2024 రేసులో మస్క్ పేరు వినిపించింది. అప్పుడు నార్వేకు చెందిన పార్లమెంట్ సభ్యుడు మారియస్ నీల్సన్.. గతేడాది ఫిబ్రవరి నెలలో మస్క్ పేరును ప్రతిపాదించారు. కానీ అప్పుడు అతనికి ఆ బహుమతి రాలేదు. అయితే ఈ సారైనా ఆయనకు నోబెల్ బహుమతి రావాలని మస్క్ అభిమానులు, మద్దతుదారులు కోరుకుంటున్నారు.
నోబెల్ శాంతి బహుమతికి ఎలాన్ మస్క్ నామినేట్ !
January 30, 2025
0
Tags