పెళ్లయిన తర్వాత తొలిసారి వచ్చిన ఆంధ్రా అల్లుడికి హైదరాబాద్ అత్తింటివారి మర్యాదలు అబ్బురపరిచాయి. అత్తమామలు 130 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కాకినాడకు చెందిన తమ అల్లుడికి తెలంగాణ వంటకాలు రుచి చూపించి ఆనందపరిచారు. సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్‌లో నివాసముంటున్న కాంత్రి-కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తెను కాకినాడకు చెందిన మ్లలిఖార్జున్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు. సంక్రాంతికి తొలిసారి అల్లుడు రావడంతో ఆయనకు తెలియకుండా సర్‌ప్రైజ్ చేసేందుకు పిండివంటలతోపాటు మాంసాహారం, శాఖాహారం, పులిహోరా, బగారా లాంటి 130 రకాల వంటలు వడ్డించారు.
130 రకాల తెలంగాణ వంటలు ఆంధ్రా అల్లుడికి వడ్డన !
January 13, 2025
0
Tags