హైదరాబాద్ లో నగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.71లక్షల దరఖాస్తులు వచ్చాయని గృహనిర్మాణశాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు 7.50లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో మిగతా 3.21లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని వెల్లడించారు. సర్వే పూర్తయిన తర్వాతే జీహెచ్‌ఎంసీలో వార్డు సభలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,249 మంది సిబ్బంది దరఖాస్తుల పరిశీలనలో పాల్గొంటున్నారని తెలిపారు. సర్వే సిబ్బంది వివరాలు https://indirammaindlu.telangana.gov.in/applicantSearchలో చూడొచ్చని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు వార్డు సభల్లో కొత్తగా దరఖాస్తులు ఇవ్వొచ్చని అధికారులు సూచించారు. మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కట్టేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం.. జీహెచ్‌ఎంసీలోని 24 నియోజకవర్గాలకు 84వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. ప్రజాపాలన సభల్లో మొత్తం 10.71లక్షల దరఖాస్తులందాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.71లక్షల దరఖాస్తులు
January 23, 2025
0
Tags