ముంబయిలోని వాంఖడే క్రికెట్ స్టేడియం 50ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్ సంబరాలు నిర్వహిస్తోంది. ఈ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగి నేటికి సరిగ్గా 50ఏళ్లు. 1975లో జనవరి 23-29 మధ్య భారత్, వెస్టిండీస్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో దివంగత ఏక్‌నాథ్ సోల్కర్ సెంచరీ చేశాడు. దీన్ని పురస్కరించుకుని బుధవారం వాంఖడే స్టేడియంలో ఎంసీఏ క్రికెట్ బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. 14,505 ఎరుపు, తెలుపు బంతులను ఉపయోగించి 'ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం' అనే వాక్యాన్ని రాశారు. ఈ వరల్డ్ రికార్డు కోసం ఉపయోగించి బంతులను ముంబయి నగరంలోని పాఠశాలలు, క్లబ్స్, ఎన్జీవోల్లోని యువ క్రికెటర్లకు ఇవ్వనున్నారు.
అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న ముంబయి క్రికెట్ అసోసియేషన్ !
January 23, 2025
0
Tags