కరివేపాకు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


రివేపాకును ఉదయాన్నే నమిలి తింటే జీర్ణ ప్రక్రియ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయాన్నే పరిగడుపున తంటే మాత్రం జీర్ణ ఎంజైమ్ లు ఉత్తేజితమవుతాయి. దాంతో ప్రేగు కదలికలు చాలా సులభతరం అవుతాయి. దాంతో మలబద్దకం లాంటి సమస్యలు తగ్గిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే చాలా మందికి రక్తహీనత, బలహీనత లాంటివి అనిపిస్తాయి. అంతే కాకుండా వాంతులు, వికారం లాంటివి కూడా ఎక్కువగా అనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారంతా కూడా కరివేపాకును ఉదయాన్నే నమిలి తింటే మాత్రం ఈ సమస్యలు అన్నీ మటుమాయం అవుతాయి. ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే మాత్రం మార్నింగ్ సిక్నెస్ తగ్గిపోతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఈజీగా వారు బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే కరివేపాకును నమిలి తింటే నిర్వషీకరణ బాగా జరుగుతుంది. దాంతో ఆటోమేటిక్ గా కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. కరివేపాకు ఇందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఉదయం పూట ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగాలి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు తింటే మాత్రం జుట్టు రాలే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఉదయాన్నే టిఫిన్ తినే ఒక 30 నిముషాల ముందు ఈ కరివేపాకును తింటే జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)