స్లోవేకియా ప్రధాని ఫిట్జోపై కాల్పులు ?

Telugu Lo Computer
0


స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫిట్జోపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. హాండ్లోవాలోని సాంస్కృతిక కేంద్రం ముందు ప్రధాని ఫిట్జో ప్రజలకు అభివాదం చేస్తుండగా, అక్కడి గుంపులోంచి ఒకరు పలుమార్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రధానిపై జరిగిన హత్యాయత్నమేనని అధికారులు చెబుతున్నారు. తాము అనేకసార్లు కాల్పుల శబ్దాలు విన్నామని ప్రధాని కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు వివరించారు. ఫిట్జోను ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. కాల్పులు జరిపిన వెంటనే ప్రధానిని ఆయన అంగరక్షకులు కారులోకి ఎక్కిస్తూ కనిపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)