సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య ?

Telugu Lo Computer
0


చిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ప్రకాశ్‌ కాప్డే తుపాకీతో కొల్చుకొని ఆత్యహత్యకు పాల్పడినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. ఆయన స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ లో జవాన్ గా పని చేస్తున్నాడు.  స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పిఎఫ్)కు అటాచ్ అయిన ప్రకాష్ గోవింద్ కపాడే (39) తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కపాడే గత వారం తన కుటుంబంతో కలిసి తన స్వగ్రామం జామ్నేర్‌కు వచ్చారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. అతను తెల్లవారుజామున 1.30 గంటలకు లేచి తలపై రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారి తెలిపారు. కాల్పుల శబ్దం విని ఇంట్లో ఉన్న మరికొందరు నిద్ర లేచి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే కపాడేను ఆసుపత్రికి తరలించారు. కానీ అతడు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)