ఇండోనేషియాలో వరదల్లో 28 మంది మృతి !

Telugu Lo Computer
0


ఇండోనేషియాను భారీ వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో 28 మరణించగా, నలుగురు గల్లంతయ్యారని ఆదివారం అధికారులు తెలిపారు. ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్స్ లో  శనివారం గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తడంతో 28 మరణించారని ప్రావిన్షియల్ రెస్క్యూటీమ్ చీఫ్ అబ్దుల్ మాలిక్ పేర్కొన్నారు. గల్లంతైన నలుగురి కోసం గాలిస్తున్నామని అన్నారు. శనివారం రాత్రి వరదలు తన్హ్ దతార్ రీజెన్సీకి బురద కొట్టుకొచ్చిందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఉప జిల్లాలను ప్రభావితం చేసిందని అన్నారు. 84 హౌసింగ్ యూనిట్లు, 16 వంతెనలు ప్రభావితమయ్యాయని అన్నారు. రహదారిని పునరుద్ధరించేందుకు భారీ యంత్రాలను మోహరించినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)