ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న జంట !

Telugu Lo Computer
0


తెలంగాణలోని జనగామ జిల్లా రాజాపేట జంగాల కాలనీకి చెందిన పులేందర్, బచ్చన్నపేటకు చెందిన మహిళ ఎవరూలేని సమయంలో ఒకే గదిలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పులేందర్ భార్య ఆ గదికి తాళం వేసింది. వాళ్లు ఇద్దరికీ పోలీసులకు పట్టిచేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఈ సమయంలో పులేందర్, ఆ మహిళ ఇద్దరు ఆ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, పులేందర్ భార్య వచ్చి చూసే సరికి అక్కడ వాళ్లిద్దరి మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ జటం ఆత్మహత్యలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అసలు వీరివి ఆత్మహత్యలేనా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా మృతులకు ఉన్న సంబంధం ఏంటి? అసలు వాళ్లిద్దరు ఒకే గదిలో ఎందుకు ఉన్నారు? ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు వంటి ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు దొరికే ఆస్కారం ఉంది. ఎప్పటి నుంచో కౌన్సిలర్స్, మానసిక నిపుణులు సూచనలు చేస్తూనే ఉన్నారు. కట్టుకున్న వారిని మోసం చేస్తే వారి జీవితాల్లో ఆనందం మాయమౌతుంది అంటారు. తాము పెట్టుకున్న ఒక అక్రమ సంబంధాన్ని కవర్ చేసుకుంటే వాళ్లు తమ జీవితాల్లో ఉండే సంతోషాన్ని కోల్పోతారని విరిస్తున్నారు. వారి సూచనలకు ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)