ప్లైట్‌లో పల్లెటూరి యువతి నిర్వాకానికి ఖంగుతిన్న ఎయిర్‌హోస్టెస్ !

Telugu Lo Computer
0


యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విమానంలో పల్లెటూరి యువతికి నిర్వాకం చూసి ఎయిర్‌హోస్టెస్ అవాక్కైంది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పల్లెటూరి యువతి విమానం ఎక్కింది. ప్లైట్‌లో ఆమె చేసిన పనికి ఎయిర్‌హోస్టెస్ షాక్ అయింది. విమానం గాల్లో ఉండగా యథావిధిగా ప్రయాణికులందరికీ భోజనాలు, కూల్‌డ్రింక్స్ తదితరాలు వచ్చేశాయి. అయితే అందులో ఉన్న పల్లెటూరి యువతి  అవేవీ తినకుండా తన వెంటన తెచ్చుకున్న బాక్స్‌ను ఓపెన్ చేసింది. అందులో బీహార్‌లో  ఫేమస్ వంటకం అయిన సత్తు పానీయం సిద్ధంగా ఉంది. దాన్ని చేత్తో బాగా కలిపి తాగతూ ఉండగా ఆమెను ఎయిర్‌హోస్టెస్‌ దూరం నుంచి గమనించింది.దగ్గరికి వచ్చి ఏంటది అంటూ ప్రశ్నించింది. యువతి చెప్పిన మాటకు ఎయిర్‌హోస్టెస్ వాట్..! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి బదులుగా ఆ యువతి కూడా ఇంగ్లీష్ రాదు అన్నట్లుగా వాట్..! అంటూ బదులిచ్చింది. దీంతో ఎయిర్‌హోస్టెస్‌కు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ అనుభవాన్ని మొత్తం ఆ యువతి తన పక్కన ఉన్న వారికి చెబుతూ ఉంది. వాళ్లు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''ఈ యువతి కామెడీ మామూలుగా లేదుగా''... అంటూ కొందరు, ''ఎయిర్‌హోస్టెస్‌కే చుక్కలు చూపించిన యువతి''.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లు, 12 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)