హమాస్ బందీలందరినీ విడిచిపెట్టే వరకు సంధి ఉండదు !

Telugu Lo Computer
0


విజయానికి అడుగుదూరంలోనే ఉన్నామని, అప్పటి వరకు కాల్పుల విరమణ ఉండదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ బందీలందరినీ విడిచిపెట్టే వరకు సంధి ఉండదని చెప్పారు. ఈ దాడిలో మేము చాలా మూల్యాన్ని చెల్లించామని ఆయన అన్నారు. బందీలు తిరిగి రాకుండా కాల్పుల విరమణ ఉండదని చెప్పారు. ఇజ్రాయిల్ ఒప్పందానికి సిద్ధంగా ఉంది, కానీ లొంగిపోవడానికి కాదని నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయ ఒత్తిడి హమాస్ తన స్థావరాలను బలోపేతం చేసుకోవడానికి మాత్రమే కారణమవుతుందని, అంతర్జాతీయ సమాజం ఒత్తిడి హమాస్‌కి వ్యతిరేకంగా ఉండాలని, ఇది బందీల విడుదల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఏప్రిల్ 1న గాజాలో వైమానిక దాడిలో యూఎస్ ఫుడ్ ఛారిటీ వరల్డ్ కిచెన్‌కి చెందిన ఏడుగురు సభ్యులు మరణించారు. దీంతో అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు ఇజ్రాయిల్‌పై ఆగ్రహంతో ఉన్నాయి. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ గురువారం నెతన్యాహూకి ఫోన్ చేసి తక్షణం కాల్పుల విరమణకు డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా అనేక దాడుల వెనక ఇరాన్ తన ప్రాక్సీలను ఉంచుతోందని నెతన్యాహూ ఆరోపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)