కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు !

Telugu Lo Computer
0
తెలంగాణలోని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తెల్లంకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు  లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కావడం.. మరో వైపు కీలక నేతలు కాంగ్రెస్ లోకి చేరుతుండటంతో బీఆర్ఎస్ నేతలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. అయితే ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు అనర్హత వేటు వేయాలని ఆందోళన చేస్తున్న తరుణంలో తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడం ఆసక్తిని రేపుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)