బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంది. 2023 చివరి త్రైమాసికంలో ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. చివరి మూడు నెలల్లో యూకే జీడీపీ 0.3 శాతం క్షీణించినట్లు అక్కడి జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. సేవలు, పారిశ్రామికోత్పత్తి, నిర్మాణరంగంలో స్తబ్ధత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జీడీపీ క్షీణత 0.1 శాతం ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా.. అంతకుమించి క్షీణించడం గమనార్హం. ఎన్నికల ఏడాది బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఇది ఇబ్బంది పెట్టే అంశమనే చెప్పాలి. సాధారణంగా వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీలో మందగమనం నమోదైతే దాన్ని మాంద్యంగా వ్యవహరిస్తారు. బ్రిటన్ జీడీపీ అంతకుముందు త్రైమాసికంలోనూ 0.1 శాతం క్షీణించింది. దీంతో చివరి త్రైమాసికంలో మాంద్యంలోకి జారుకున్నట్లయ్యింది. 2020 తొలి అర్ధభాగంలో వృద్ధి నెమ్మదించడంతో బ్రిటన్ ఒకసారి మాంద్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి.
ఆర్థిక మాంద్యంలోకి బ్రిటన్ ?
February 15, 2024
0
Tags