దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా పొందినవారు మూడు నెలల పాటు దుబాయ్‌లో ఉండొచ్చు. దీనిని మరో 90 రోజులపాటు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదిలో ఆరు నెలలకు మించకుండా దుబాయ్‌లో ఉండేందుకు ఈ కొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చింది. వ్యాపారం, వినోదాత్మక పర్యటనల కోసం ఈ వీసాను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. దుబాయ్‌కు వచ్చే టూరిజం పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు ఇది దోహద పడుతుందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇక దుబాయ్ వెళ్తున్న పర్యాటకుల్లో అత్యధికులు భారతీయులే కావడం విశేషం.
ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన దుబాయ్ !
February 23, 2024
0
Tags