మెంతులు మధుమేహం సహా అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేస్తాయి. తినడానికి చిరు చేదుగా అనిపించినా మెంతులు వల్ల కలిగే కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటాం. పౌడర్లు, క్యాప్సూల్స్ , నూనెలతో సహా వివిధ రూపాల్లో లభిస్తున్న ఈ మెంతులు స్త్రీ,పురుషులలో ఇతర వైద్య పరిస్థితులకు కూడా సహాయపడతాయని నమ్ముతారు. మెంతులు (ట్రైగోనెల్లా ఫోనమ్-గ్రేకమ్) అనేది బఠానీ కుటుంబానికి (ఫాబేసి) చెందిన సుగంధ ద్రవ్యం.గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది,జుట్టు పెరుగుదలకు మంచిది, బ్లడ్ కొలెస్ట్రాల్‌ను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుంది. జ్వరం, అలెర్జీ , గాయాల చికిత్సలో సహాయకారి. మెంతులు మన రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలంటారు నిపుణులు. మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది.అంటే ఒంట్లో కొవ్వు కరుగుతుంది. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం లేవగానే పరగడుపున ఆ నీళ్లను తాగాలి. ఇలా చేయడంవల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అదేవిధంగా విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు ఉపయోగపడుతాయి. మెంతి టీ ద్వారా బ్లడ్ లో షుగర్ అదుపులో ఉంటుంది. చిటపట శబ్దం వచ్చేదాకా మెంతులను వేయించి మెత్తగా పౌడర్‌లా చేసుకుని , రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మహిళలు సౌందర్య పోషణలో కూడా మెంతులకు విరివిగా వాడవచ్చు బాగా మెత్తగా దంచిన మెంతిపౌడర్‌లో కొద్దిగా తేనె కలిపిన మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఎండిన తరువాత నీటితో చక్కగా కడిగేసుకుంటే.. చర్మం భలే స్మూత్‌గా ఉంటుంది. మెంతులలో ఉండే లెసిథిన్ కనుబొమ్మలే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. నాన పెట్టిన గుప్పెడు మెంతులను మెత్తని ముద్దగా నూరుకోవాలి. దీన్ని కనుబొమ్మలకు రాసుకుని 20-25 నిమిషాల తరువాత తడి గుడ్డతో చాలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు- నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కండరాల నొప్పులకు మెంతులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.ఐరన్ లోపాన్ని కూడా ఈ మెంతులు తగ్గిస్తాయి. కఫం,దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలకు మెంతు మంచి ఉపశమనం కలిగిస్తాయి.
మెంతులు - ఆరోగ్య ప్రయోజనాలు !
January 18, 2024
0
Tags