కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం బెంగళూరులోని తన నివాసంలో నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్‌తో తుది శ్వాస విడిచారాయన. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సుమారు 900కు పైగా లకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన అన్నయ్య కు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే కృష్ణవంశీ నక్షత్రం మూవీకి కూడా వర్క్ చేశారు. బాస్టియన్ హఠాన్మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఫైట్ మాస్టర్ మృతికి నివాళి అర్పించారు.
ఫైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ మృతి
December 28, 2023
0
Tags