ఎస్‌ఐ నియామకాలపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్​లోని ఎస్సై నియామకాల్లో ఎత్తు కొలతల అంశంలో అవకవతకలపై దాఖలైన పిటిషన్​పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎత్తు కొలతల అంశంలో అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థులకు న్యాయమూర్తి సమక్షంలో పరీక్షలు నిర్వహించారు. అయితే రిక్రూట్​మెంట్​ బోర్డు కొలతలు.. న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించిన కొలతలు సరిపోవడంతో.. అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రిక్రూట్​మెంట్​పై విధించిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది.ఉత్తర్వులను ఎత్తేసిన నేపథ్యంలో.. ఫలితాలను విడుదల చేసుకోవచ్చని రిక్రూట్​మెంట్​ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్​ తరపున వాదనలు వినిపించిన న్యాయవాజది జడ శ్రావణ్​ కుమార్​ 2019లో ఎత్తు అంశంలో అర్హత సాధించారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2019లో అర్హతగా పరిగణలోకి తీసుకున్న అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్​ను న్యాయస్థానానికి అందించారు. దీంతో అభ్యర్థుల మెడికల్​ సర్టిఫికెట్స్​ పునః పరిశీలన చేసి వారం రోజుల్లో కోర్టు ముందు ఉంచాలని రిక్రూట్​మెంట్​ బోర్డు అధికారులను హైకోర్డు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)