దేశంలో తాజాగా 83 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 512 వరకు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డేటా మంగళవారం వెల్లడించింది. మంగళవారం ఉదయం 8 గంటలకు సవరించిన సంఖ్య ప్రకారం మృతుల సంఖ్య 5,33,301గా నమోదైంది. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4.50 కోట్లు కాగా, కోలుకున్న వారి సంఖ్య 4,44,68,508 గా ఉంది. రికవరీ రేటు 98.81శాతం కాగా, మృతుల రేటు 1.19 శాతం. ఇంతవరకు 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
కొత్తగా 83 కరోనా కేసులు నమోదు !
December 05, 2023
0
Tags