తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. రెండు రోజుల ఉత్కంఠకు తెర దించుతూ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ లో ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో చర్చించిన అధిష్టానం సీఎంగా రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. హైకమాండ్ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలియజేసిన ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. రేవంత్ రెడ్డి సీఎంగా 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి
December 05, 2023
0
Tags