వ్యాయువ ఢిల్లీలోని భరత్ నగర్ వజీర్‌పూర్ జేజే కాలనీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రాకేష్ (35) భార్య, ఇద్దరు కుమారులతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాకేష్ తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాకేష్ తన ఐదేళ్ల పెద్ద కుమారుడు, రెండేళ్ల చిన్న కుమారుడితో కలిసి రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఓ పదునైన కత్తితో తన ఇద్దరు కుమారుల గొంతు కోసి అదే కత్తితో తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం గది నుంచి బయటకు వచ్చి భార్యతో అసలు విషయం చెప్పాడు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా అప్పుటికే అతడి రెండేళ్ల చిన్న కుమారుడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇక విషమ పరిస్థితిలో ఉన్న రాకేష్, అతడి పెద్ద కుమారుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం రాకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం ఉద్యోగం లేని రాకేష్ తాగుడుకు బానిసయ్యాడని, దీంతో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడని పోలీసు అధికారి తెలిపారు. సోమవారం కూడా తాగి భార్యతో గొడవ పడిన రాకేష్ కోపంలో ఇద్దరు కుమారుల గొంతు కోసి ఆపై అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
కుటుంబ కలహాలతో ఇద్దరు కుమారుల గొంతు కోసి, ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి !
November 21, 2023
0
Tags