ఆధునిక వైద్య విధానాన్ని, అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం పట్ల పతంజలి ఆయుర్వేద్‌పై సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడింది.అహసనుద్దీన్ అమనుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ధిష్ట వ్యాధులను తమ ఉత్పత్తులు నయం చేయగలవని తప్పుడు ప్రచారం చేస్తే పతంజలికి రూ. కోటి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది. పత్రికల్లో ఇలాంటి చవకబారు ప్రకటనలు చేయకుండా సంయమనంతో వ్యవహరించాలని పతంజలిని మందలించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి పేర్కొన్న అంశాలు వెరిఫై కాలేదని, ఇవి డ్రగ్స్,రెమెడీస్ చట్టం 1954, వినియోగదారుల రక్షణ చట్టం వంటి పలు చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఐఏఎం పేర్కొంది.
పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక !
November 21, 2023
0
Tags