మూడు రోజుల్లో పెళ్లి అనగా వరుని ఇంట్లో శవమైన వధువు !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని టీబీ డ్యాం నివాసి ఐశ్వర్య (26) అనే యువతి, అశోక్‌ (27)  ఐదారేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు వేర్వేరు కులాల వారు అయినప్పటికీ పెద్దల అంగీకారంతో పలు షరతులతో వివాహానికి సిద్ధమయ్యారు. తమ సంప్రదాయ ప్రకారం పెళ్లాడదామని ఐశ్వర్యను వరుడు తీసుకెళ్లాడని, తమ తరఫు నుంచి ఎవరూ రావద్దని చెప్పారని అమ్మాయి బంధువులు తెలిపారు. ఇంతలో యువతి ఆత్మహత్య చేసుకుందని హఠాత్తుగా కట్టుకథ అల్లుతున్నారని ఆరోపించారు. వారితో మనకు పొసగదని, ఈ పెళ్లి వద్దు అని మా కూతురికి చెప్పాం. ఆమె చాలా దృఢమైన మనస్సు గలది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, యువకుడి కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడ్డారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతి తండ్రి సుబ్రమణి మాట్లాడుతూ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి వద్దని నేను వారించినా, కూతురు, బంధువులు ఒప్పుకోలేదు, 15వ తేదీన ఆమె అమ్మమ్మ ఇంట్లో పూజలు చేయడానికి పంపించాము. 16వ తేదీన అశోక్‌ ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఫోన్‌ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పారు. అంతకుముందే వారు రెండు ఆస్పత్రులకు ఆమెను తీసుకెళ్లారు. ఎలా చనిపోయిందో తెలియదు అని వాపోయారు. అశోక్‌ కుటుంబమే హత్య చేసిందని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వరున్ని అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)