12 వేల మంది ప్రవాసులపై కువైట్‌ బహిష్కరణ వేటు !

Telugu Lo Computer
0


కువైట్‌ 3 నెలల్లో సుమారు 12 వేల మంది ప్రవాసీయులను వారి దేశాలకు పంపించేసింది. ఈ ఏడాది అగస్టు నుంచి అక్టోబర్‌ వరకు 12 వేల మందిని బహిష్కరించింది. వివిధ నేరాలతో పాటు ప్రజా నైతిక నిబంధనల ఉల్లంఘన, కార్మిక చట్టాల అతిక్రమణ ఆరోపణలతో అక్టోబర్‌లో 4,300 మందిని వెళ్లగొట్టారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా అడ్డుకోవడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నప్పటికీ ప్రవాసీయుల సంఖ్యను తగ్గించుకోవడానికే కువైట్‌ ఈ చర్యలకు పాల్పడుతున్నదన్న విమర్శలున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)