వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


కేరళలోని కోజికోడ్‌లో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లో ప్రమాదం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగుచూడాల్సి ఉంది. ఇక ఈరోజు ఉదయం కర్నాటకలోని మాండ్యలో నూతనంగా ప్రారంభించిన మెగా డైరీ యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడటంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్నఅగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయని అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)