మణిపూర్‌లో హింసాత్మాక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇంఫాల్‌లో మంత్రి నివాసం ఎదుట జరిగిన పేలుడులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్, ఓ మహిళ గాయపడినట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు పంచాయతీరాజ్, గ్రామీణాభివఅద్ధి శాఖ మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ నివాసం గేటు వద్ద గ్రెనేడ్‌ను విసిరినట్లు తెలిపారు. ఈ పేలుడులో మంత్రి నివాసం ఎదుట విధులు నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్ చేతికి స్వల్పగాయాలయ్యాయని అన్నారు. స్థానిక మహిళ కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు.
మణిపూర్‌లో మంత్రి నివాసం ఎదుట పేలుడు !
October 08, 2023
0
Tags