మహారాష్ట్రలోని నాసిక్‌లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనకు రైతుల నుంచి నిరసన వ్యక్తం అయింది. అజిత్ పవార్ కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్నారు. టమాటా ధరలు తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అజిత్ పవార్ వాహనంపై ఉల్లిపాయలు, టమోటాలు విసిరారు. పవార్ ఓఝర్ విమానాశ్రయం నుంచి దిండోరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఉల్లి ఎగుమతులపై భారీగా సుంకం విధించడంతో ఉల్లిగడ్డ పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే నాసిక్‌లో హోల్‌సేల్ రైతులు, హోల్ సేల్ వ్యాపారులు 13 రోజుల పాటు సమ్మె చేశారు. సుంకాన్ని తొలగిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అక్టోబర్ 3న సమ్మె విరమించారు. అటు భారీగా పడిపోయిన టమోటాలకు మద్దతు ధర కల్పించాలని రైతులు నల్లజెండాలు చేతబూని నిరసన తెలిపారు.
అజిత్ పవార్ వాహనంపై ఉల్లిపాయలు, టమోటాలతో రైతుల దాడి !
October 08, 2023
0
Tags